తండ్రి కాబోతున్న హార్ధిక్ పాండ్యా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2020 9:37 PM IST
తండ్రి కాబోతున్న హార్ధిక్ పాండ్యా

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా త్వ‌ర‌లో తండ్రి కాబోతున్నాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా హార్దిక్ పాండ్యానే వెల్ల‌డించాడు. త‌న ప్రేయ‌సీ నటాషా స్టాన్‌కోవిచ్‌ ప్రెగ్నెంట్ అని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. అంతేకాదు నటాషాతో దిగిన తాజా ఫోటోను పోస్టు చేశాడు.

‘నటాష, నేను కలిసి అద్భుత ప్రయాణం చేస్తున్నాం. ఇది మరింత అమోఘం కానుంది. త్వరలో మా జీవితాల్లోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ కొత్త దశలో ఎంతో సంతోషంగా ఉన్నాం. మీ ఆశీస్సులు కోరుతున్నాం' అని హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఈ ఏడాది కొత్త‌సంవ‌త్స‌రం వేడుక‌ల్లో దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోనున్నారు. హార్ధిక్‌కు ప‌లువురు క్రికెట‌ర్లతో పాటు అభిమానులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Next Story