చిరకాల స్వప్నం తీరిన వేళ.. అంజలితో కలిసి సచిన్ డ్యాన్స్
By తోట వంశీ కుమార్ Published on 8 April 2020 2:31 PM GMTక్రికెట్ ప్రేమికులు దేవుడిగా అభిమానించే క్రికెటర్ సచిన్ టెండ్కూలర్. దాదాపు 24 సంవత్సరాల పాటు తన కెరీర్ ను కొనసాగించాడు. ఇంత సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మరుపురాని విజయాలను టీమ్ఇండియాకు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్ అతను. దాదాపుగా క్రికెట్‌లో అన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. వరల్డ్‌కప్ గెలవాలనేది సచిన్ కల. అందుకోసం 22 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది.
1989లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరగ్రేటం చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన ప్రపంచకప్ కోరికను తీర్చుకోవడానికి 22 సంవత్సరాలు పట్టింది. 2011కు మందు ఐదు (1992,96,99,2003,2007) సార్లు ప్రపంచకప్ ఆడి.. రిక్తహస్తాలతో వెనుదిరిగిన ఈ దిగ్గజ ఆటగాడు 6వ సారి మాత్రం ప్రపంచ కప్‌ను ముద్దాడాడు.
వాంఖడే వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి రెండో సారి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. దీంతో స్వదేశంలో సొంత అభిమానుల మధ్య కప్‌ను అందుకుని తన చిరకాల వాంఛను తీర్చుకున్నాడు.
భారత్ ప్రపంచ కప్ గెలిచి ఇటీవల తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విన్నింగ్ జట్టులోని సభ్యుడు హర్భజన్ సింగ్ ఆ మ్యాచ్ అనంతరం జరిగిన ఓ ఆసక్తికర అంశాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
ఆరోజు రాత్రి సచిన్.. తన భార్య అంజలితో కలిసి డ్యాన్స్ చేశాడని తెలిపాడు ఈ టర్బోనేటర్.‘సచిన్ బ్యాటింగ్ చేయడం తప్ప మరో పని చేయడం ఎప్పుడు చూడలేదు. కానీ, ఆ రోజు రాత్రి ఆయన సంతోషంగా డ్యాన్స్ చేశారు. తన భార్య అంజలితో కలిసి హిందీపాటకి చిందులు వేశారు. వాళ్లు ఇద్దరు డ్యాన్స్ చేయడం చూసి మేము చాలా సంతోషించామని అని హర్భజన్ తెలిపారు.