మ‌హిళా దినోత్స‌వాన్ని ఎందుకు జ‌రుపుకొంటారో తెలుసా..?

By సుభాష్  Published on  5 March 2020 7:49 AM GMT
మ‌హిళా దినోత్స‌వాన్ని ఎందుకు జ‌రుపుకొంటారో తెలుసా..?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతియేటా మార్చి 8వ తేదీన ఘనంగా నిర్వహించుకుంటారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు.. ఇప్పుడు అన్నింటిలో ముందుంటున్నారు. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. ఈ మహిళా దినోత్సవాన్ని ప్రతి యేటా ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తూ వస్తోంది. 1908లో ఈ మహిళ దినోత్సవ పుట్టుకకు బీజాలు ఏర్పాడ్డాయి. ఉద్యోగంలో భాగంగా తక్కువ పని గంటలు, మంచి జీవితం, వివిధ హక్కుల కోసం న్యూయార్క్‌ లో 15వేల మంది మహిళలు ప్రదర్శన నిర్వహించారు. కాగా, మహిళల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని అమెరికా సోషలిస్ట్‌ పార్టీ 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో అప్పట్లో ఓ మహిళకు ఆలోచన వచ్చింది. ఆ మహిళ ప్రతిపాదనను 1910లో జరిగిన ఇంటర్నేషనల్‌ కార్ఫరెన్స్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఉమెన్‌ సదస్సులో అంగీకరిచారు. ఈ సదస్సుకు 17 దేశాల నుంచి హాజరయ్యారు.

తొలిసారిగా..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రేలియా, డెన్మార్క్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. అంతేకాదు 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి.

మార్చి 8నే ఎందుకు జరుపుకోవాలి..?

మహిళా దినోత్సవాన్ని ప్రతియేటా మార్చి 8వ తేదీనే ఎందుకు జరుపుకోవాలనే అనుమానం చాలా మందిలో తలెత్తుతుంది. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు 'ఆహారం-శాంతి' డిమండ్‌ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్‌ నికోలస్‌జా తన సంహాసనాన్ని వదులుకోవాల్సిప పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం.. మహిళలకు ఓటు వేసే హక్కును కల్పించింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం (అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌ను అనుసరించే వారు) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం చూస్తే.. మార్చి 8వ తేదీ. అందుకే ఈ తేదీనే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక దేశాల్లో అమలవుతోంది

పురుషుల దినోత్సవం కూడా ఉందా..?

మహిళా దినోత్సవం జరుపుకుంటున్నట్లు పురుషుల దినోత్సవం కూడా ఉందా..? అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. 60కిపైగా దేశాల్లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. 2007 నుంచి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా జరుపుతున్నారు.

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై ఆధ్వర్యంలో వేడుకలు

తెలంగాణ గవర్నర్‌ తమిళి సై ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో వివిధ రంగాల్లో సత్తా చాటిన మహిళలకు ఆమె అవార్డులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే గొంగెటి సునీత, రోజాతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు హాజరు కానున్నారు.

Next Story