ఏ భాష‌లోనైనా చేయ‌డానికి రెడీ - హ‌న్సిక‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 6:24 AM GMT
ఏ భాష‌లోనైనా చేయ‌డానికి రెడీ - హ‌న్సిక‌

దేశముదురు చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మైన అందాల క‌థానాయిక హ‌న్సిక‌. తొలి చిత్రంలోనే అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. తాజాగా సందీప్ కిషన్ తో క‌లిసి న‌టించిన చిత్రం తెనాలి రామ‌కృష్ణ బి.ఎ, బి.ఎల్. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అన్నది ఉపశీర్షిక. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్‌.ఎన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌ రెడ్డి, రూపా జగదీష్‌ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 15న తెనాలి రామ‌కృష్ణ‌ గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా హీరోయిన్ హన్సిక మాట్లాడుతూ...

గతంలో నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ‘దేనికైనా రెడీ’ చిత్రాన్ని చేయడం జరిగింది. ఆ సినిమా నటిగా నాకు మంచి పేరు తీసుకువచ్చిందన్నారు. ఆప్పటి నుంచి నాగేశ్వర రెడ్డితో మంచి పరిచయం ఉందన్నారు. అయితే ఈ మూవీలో నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జ‌యిటింగ్‌ గా అనిపించిందని అన్నారు.

తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేయాల‌నుకుంటాను కానీ... దురదృష్టవశాత్తు ఎందుకో ఒక తెలుగు సినిమా తర్వాత మరొకటి చేయడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందన్నారు. నేను తమిళ సినిమాలలో బిజీ అవడం కూడా ఒక కారణమని తెలిపారు. కానీ తెలుగులో సినిమా చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా అస్సలు వదులుకోనూ తప్పకుండా చేస్తానని అన్నారు. నాకు భాషా భేధాలు అంటూ ఏమీ లేవు. మంచి చిత్రం అనుకుంటే ఏభాషలోనైనా చేయడానికి సిద్దమే అని అన్నారు.

Next Story
Share it