జ‌ర్మ‌నీలో వ‌రుస కాల్పులు.. 8మంది మృతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Feb 2020 7:47 AM GMT
జ‌ర్మ‌నీలో వ‌రుస కాల్పులు.. 8మంది మృతి..!

జర్మనీలో వ‌రుస‌ కాల్పుల ఘ‌ట‌న‌ కలకలం రేపుతుంది. జర్మనీలోని హనావులో.. రెండు వేర్వేరు హుక్కా బార్లలో జ‌రిగిన ఈ కాల్పుల్లో 8మంది మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. దుండగులు రెండు బార్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డాడు.

తుపాకులు ధరించి బార్ల‌కు వ‌చ్చిన గుర్తు తెలియని వ్యక్తులు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు కాల్పులకు తెగ‌బ‌డ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కాల్పులు జరిపిన వారి కోసం వెతుకుతున్నారు. కాల్పులు జ‌రిగిన‌ షిషా బార్ లో ముగ్గురు, అరేనా బార్ అండ్ కేఫ్ లో ఐదుగురు మృతి చెందారు.

ఇదిలావుంటే.. కాల్పులు జరిగిన రెండు బార్ల వ‌ద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ కాల్పులు ఎవరు జరిపారు? కారణం ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. వ‌రుస‌ కాల్పులతో జర్మనీ వాసులు ఒక్క‌సారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఇది ఉగ్రవాదుల పనా? లేదా వేరెవ‌రైనా ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారా అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేపట్టారు.

Next Story