హాఫ్ హెల్మెట్ పెట్టుకున్నా జరిమానా తప్పదు!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Oct 2019 2:30 PM GMTహైదరాబాద్ : ట్రాఫిక్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకు హాఫ్ హెల్మెట్ ధరించే వారికి షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. హాఫ్ హెల్మెట్ పెట్టుకుంటే కూడా ఫైన్ కట్టాల్సిందేనంటున్నారు పోలీసులు.
హాఫ్ హెల్మెట్లు ప్రాణాలు కాపాడలేవని, వాటిని ధరించినా హెల్మెట్ ధరించినట్టు కాదని, హాఫ్ హెల్మెట్ క్యాప్‌గా పరిగణిస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. అందుకే, వితవుట్ హెల్మెట్ అని ఈ చలాన్‌లు జారీ చేస్తున్నామన్నారు. పోలీసుల నిర్ణయంతో వాహనదారులు షాక్‌కు గురవుతున్నారు.
హాఫ్ హెల్మెట్లు వాడుతున్న చాలా మంది ద్విచక్ర వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఈ చలాన్లు అందుతున్నాయి. MV ACT ప్రకారం తలను పూర్తిగా కప్పి ఉంచేదే హెల్మెట్ అని చెబుతున్నారు. అది ఉంటేనే ప్రమాదాలు జరిగిన సమయంలో తలకు తీవ్రగాయాలు కాకుండా, ప్రాణాలు నిలబడుతాయన్నారు. అందుకే చట్ట ప్రకారం వితవుట్ హెల్మెట్ అనే ఆప్షన్‌తో జరిమానా విధిస్తున్నామంటున్నారు.