హాఫ్ హెల్మెంట్లు విరగ్గొడుతుంది ..ఎక్కడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Nov 2019 7:45 PM IST
హాఫ్ హెల్మెంట్లు విరగ్గొడుతుంది ..ఎక్కడా..?

హాఫ్ హెల్మెట్లు వేసుకున్న మోటార్ బైకర్లను ఆపి, వారి హెల్మెట్లను తీసుకొని ట్రాఫిక్ పోలిసులు రోడ్డు మీద వేసి విరగొడుతున్న వీడియో కొద్దిరోజులుగా ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఈ ఉదంతం హైదరబాద్ లో జరిగింది అని ప్రచారం జరుగుతోంది

అయితే, అదే వీడియోను, సైబరాబాద్ ట్రాఫిక్ పోలిసులు తమ ట్విట్టర్ లో షేర్ చేస్తూ, "ఇది హైదరాబాద్ లో జరిగింది కాదు, కానీ హాఫ్ హెల్మెట్లు ధరించడం మంచిది కాదు, వాటి వల్ల ఆక్సిడెంట్ జరిగినప్పుడు రక్షణ లభించదు. చట్ట ప్రకారం తలను పూర్తిగా కప్పి ఉంచేదే మంచి హెల్మెట్" అని ట్వీట్ చేశారు. న్యూస్ మీటర్ బృందం ఈ ఉదంతం జరిగిన ప్రదేశం గురించి దర్యాప్తు చేసింది. మొదటగా, వీడియోలో వినపడే మాటాలు కన్నడ లో ఉన్నాయి. రోడ్డుపై తిరుగుతున్న బైకుల నంబర్ ప్లేట్లను పరిశీలించగా, అవి కర్ణాటక కు చెందినవిగా తెలుస్తోంది.

కర్ణాటకలోని బంగళూరు, మైసూరు తో సహా చాలా ప్రదేశాలలో హాఫ్ హెల్మెట్లను నిషేధించారు. హాఫ్ హెల్మెట్లను ప్రజలు వాడకుండా చూసేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. గూగుల్ ట్రాన్స్ లేట్, గూగుల్ సేర్చ్ లను వాడి కన్నడ లో హాఫ్ హెల్మెట్ల గురించి సమాచారం వెతకగా, ఎన్నో వీడియో, న్యూస్ లింకులు దొరికాయి.

పబ్లిక్ టివి అనే వెబ్ సైట్ లో ప్రచురించిన కథనం ప్రకారం ఈ ఉదంతం హసన్, కర్ణాటక లో జరిగింది. "పోలిసుల ఈ చర్య బైకర్లను భయాందోళనలకు గురి చేసింది. ట్రాఫిక్ పోలీసులు బైకర్ల హెల్మెట్లను కింద పడేసి విరకొట్టారు. తరువాత ఐ ఎస్ ఐ మార్కు గల హెల్మెట్లనే వాడమని, వాటిని వెంటనే కొనుగోలు చేయమని వారికి సలహా ఇచ్చి పంపించారు. ఈ ఆపరేషన్ రెండు రోజులు సాగింది" అని ప్రచురించారు.

కర్ణాటక లోని అన్ని వార్తా చానళ్లలో ఈ వార్త ప్రచురించబడినా, ఇతర భాషల్లో ఈ వార్త కనబడలేదు.మొత్తానికి, ఈ వీడియో కర్ణాటక లోని హసన్ కి చెందినది, హైదరాబాద్ లో జరిగింది కాదు



Half Helmets2

Next Story