సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీ పై సైబర్ చోర్ దాడి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2019 3:40 PM GMT
సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీ పై సైబర్ చోర్ దాడి..!

మరో సారి సుప్రసిద్ధ సర్దార్ వల్లభ్ భాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. వెబ్ సైట్ హోం పేజీ లో ఆపిల్ ఐఫోన్ లోగో దర్శనమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరచింది..

హైదరాబాద్ లో ఉన్న సర్దార్ వల్లభ్ భాయి పటేల్ నేషనల్ పోలీస్ ఎకాడమీ లో ఐపీఎస్ ప్రొబేషనర్ల శిక్షణ పొందుతారు. ఇలాంటి సంస్థ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. దీనిని ఒక ఎథికల్ హ్యాకర్ గుర్తించి అధికారులకు తెలియచేశారు. ఎథికల్ హ్యాకర్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రిషి ద్వివేదీ న్యూస్ మీటర్ తో మాట్లాడుతూ పోలీస్ ఎకాడమీ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైందని, ఆపిల్ ఐ ఫోన్ లోగోను హ్యాకర్లు అప్ లోడ్ చేసి ఒక మెసేజ్ ను కూడా వదిలారు. ఆయన ఈ మేరకు హ్యాక్ అయిన వెబ్ సైట్ తాలూకు స్క్రీన్ షాట్ ను ట్విట్టర్ లో పోస్టు కూడా చేశాడు. అయితే ఆ తరువాత సర్దార్ వల్లభ్ భాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ SVPNPAHYD ఇదొక వదంతి మాత్రమేనని, హ్యాకింగ్ జరగనే లేదని పేర్కొంది.

అయితే ఆ వెనువెంటనే వెబ్ సైట్ ను డౌన్ చేశారు. దానిని మెయింటెనెన్స్ కోసం డౌన్ చేయడం జరిగింది. ఒక వేళ ఇది కేవలం వదంతే అయి ఉంటే వెబ్ సైట్ ఎందుకు డౌన్ చేయడం జరిగింది అని రిషి ప్రశ్నించారు. నా దగ్గర డౌన్ చేసిన వెబ్ సైట్ తాలూకు పాత ఫైళ్లు, స్క్రీన్ షాట్లు ఉన్నాయని రిషి అన్నారు. హ్యాకర్స్ వెబ్ సైట్ లోని కాలెండర్ విడ్జెట్ ను వాడుకున్నారని, ఈ విడ్జెట్ పై దాడులు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అన్నారు.

ఇటీవలే పాకిస్తానీ హ్యాకర్లు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ వెబ్ సైట్ ను హ్యాక్ చేశారు. ఈ ఏడాదిలో ఇలా చేయడం ఇది మూడో సారి. మొదటి సారి మార్చిలో ఈ వెబ్ సైట్ పై సైబర్ దాడి జరిగింది. ప్రధాని మోదీ పట్ల అవమానకరమైన మీమ్స్ పోస్ట్ చేశారు. ఆ తరువాత మే నెలలో షాడో్ _V1P3R పేరున్న హ్యాకర్ హోమ్ పేజీలో బిజెపి అన్న పదాన్ని బీఫ్ (గోమాంసం) అని, అబౌట్ బిజెపిని అబౌట్ బీఫ్ అని మార్చేశాడు. బిజెపి చరిత్ర అన్న చోట బీఫ్ హిస్టరీ అన్న పదాన్ని చేర్చాడు.

Next Story
Share it