హెచ్-1బీ వీసా తుది తీర్పులో భారతీయులకు ఊరట
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Nov 2019 4:20 PM IST
వాషింగ్టన్: హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలన్న.. ట్రంప్ సర్కార్ ఆదేశాల్ని అక్కడి కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు కాస్త ఊరట కలిగినట్లే చెప్పాలి.
అయితే 2015లో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ..ఒబామా సర్కార్ హెచ్-4 వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ..ఈ విధానం ద్వారా అనేక మంది అమెరికా ప్రజలు నష్టపోతున్నారని ట్రంప్ సర్కార్ భావించింది. ఈ మేరకు హెచ్-4 వీసా నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయిచింది.
కాగా.. ఈ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని యూఎస్ కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ కొలంబియా సర్క్యూట్ దిగువ కోర్టును కోరింది. ఈ మేరకు నిబంధనలను పూర్తిగా పరిశీలించి ఓ నిర్ణయానికి రావాలని ఆదేశించింది. అప్పటి వరకు తుది తీర్పు నిలిపివేయాలని కోరింది.
Next Story