మిస్సవుతున్నా.. ఉండలేకపోతున్నా.. కానీ ఉండాలి కదా..!
By తోట వంశీ కుమార్ Published on 30 March 2020 12:24 PM ISTకరోనా వైరస్(కొవిడ్-19) రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎక్కడి వారు అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన బాయ్ ప్రెండ్ విష్ణు విశాల్‌ను మిస్ అవుతుందటా. ఈ విషయాన్ని జ్వాలానే స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు.
లాక్‌డౌన్ కారణంగా గుత్తా జ్వాలా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. తన ప్రియుడు విష్ణు విశాల్‌ను మిస్ అవుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు మిస్ యూ..అంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన విష్ణు విశాల్ స్పందించారు. ప్రస్తుతం పరిస్ధితుల్లో సామాజిక దూరం( సోషల్ డిస్టెన్స్) ముఖ్యం అంటూ జ్వాలాను కూల్ చేశారు.
బ్యాడ్మింటన్ ఫైర్ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వగా అందులో విష్ణు.. గుత్తా జ్వాలకు ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఇందులో ఉండటం విశేషం. దీంతో వీరిద్దరూ ప్రేమాయణం నడుపుతన్నట్లు క్లారిటీ ఏర్పడింది. ఇక హీరో విష్ణు విశాల్ గతేడాది జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఇక గుత్తా జ్వాల ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సహచర ఆటగాడు చేతన్ ఆనంద్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల పాటు మంచిగానే ఉన్న ఈ జంట.. 2011లో ఊహించని రీతిలో విడాకులు తీసుకుని షాకిచ్చింది. ఇక, అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌తో డేటింగ్ చేసినట్లు ఆ మధ్యలో వార్తలు వినిపించాయి.
�