గుంటూరు: బ్లీచింగ్‌ పేరుతో రూ.70 కోట్లకుపైగా భారీ కుంభకోణం

By సుభాష్  Published on  14 May 2020 3:12 PM GMT
గుంటూరు: బ్లీచింగ్‌ పేరుతో రూ.70 కోట్లకుపైగా భారీ కుంభకోణం

కరోనా సమయంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి రూ.70 కోట్లకుపైగా నకిలీ బ్లీచింగ్‌ను సప్లై చేసినట్లు సమాచారం. సున్నానికి వాసనగా వచ్చే రంగు కలిపిన బ్లీచింగ్‌గా అమ్మకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పిడుగు రాళ్ల నుంచి కాకినాడ బ్లీచింగ్‌ సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

అయితే బ్లీచింగ్‌ అనేది సరైంది కాదని అధికారులు కాకినాడ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించగా, అసలు నిజం బట్టబయలైంది. అసలు పిడుగురాళ్లలో బ్లీచింగ్‌ తయారీకి సంబంధించిన కంపెనీ లేదని గుర్తించారు. గుంటూరు జిల్లాలో కూడా ఇదే నకిలీ బ్లీచింగ్‌ సరఫరా జరిగినట్లు అధికారులు విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

కాగా, పిడుగురాళ్లలో రెండు రోజుల కిందట సున్నం మిల్లులో జరిగిన అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కుంభకోణంపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Next Story
Share it