హవ్వా..! నాన్ వెజ్ కోసం ఇంత భయంలేకుండా ప్రవర్తిస్తారా ?

By రాణి  Published on  5 April 2020 7:56 PM IST
హవ్వా..! నాన్ వెజ్ కోసం ఇంత భయంలేకుండా ప్రవర్తిస్తారా ?

వారానికోసారైనా ముక్క తినకపోతే ముద్ద దిగదు కదా..కానీ అది ప్రాణం కన్నా ఎక్కువా ? బయట తిరిగితే కరోనా సోకే ప్రమాదముందని చెప్పి ప్రధాని గారు ముందే లాక్ డౌన్ ప్రకటించి ఇళ్లలోనే కూర్చోండ్రా..అంటే చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ అంటూ రోడ్లపై తిరుగుతున్నారు. పోనీ వస్తే వచ్చారు. కనీసం మనిషికీ మనిషికీ మధ్య ఒక మీటర్ దూరం పాటించండి అని చెప్తే..అదీ వినిపించుకోవట్లేదు. ఆ మహమ్మారి ఒక్కసారి వచ్చిందంటే అది తగ్గే మాట దేవుడెరుగు. పరిస్థితి విషమిస్తే నిన్నూ తనతోనే తీసుకుపోతుందని పోలీసోళ్లు నెత్తీ, నోరూ మొత్తుకుని చెప్తున్నా మనోళ్లు ఎవ్వరి మాట లెక్కచేయకుండా ముక్క కోసం ఇలా గుంపులు గుంపులుగా మార్కెట్లలో, చికెన్ షాపుల ఎదుట దర్శనమిచ్చారు.

Rajahmundry

ఆదివారం కావడంతో నాన్ వెజ్ కోసం గుంటూరు ప్రజలు మార్కెట్ కు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో అక్కడున్న పోలీసులు ప్రజలను అడ్డుకుని మార్కెట్ ను మూసివేయించారు. ఇలా గుంపులుగా కాకుండా..కనీస దూరం పాటిస్తూ వచ్చుంటే పోలీసులు మార్కెట్ మూసివేయించేవారు కాదుగా. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కూడా పలు మాంసం దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగుంపులుగా కనిపించారు. ఒకరినొకరు తాకితే..వారి వల్ల మనకు కరోనా వస్తుందేమోనన్న భయం కూడా లేదు. ఆ మాకెందుకొస్తుందిలే అన్న ధీమా. అసలే పరిస్థితి బాలేదు కదా. ఇంకా 10 రోజులాగితే లాక్ డౌన్ ఎత్తేస్తారు. అప్పటి వరకూ ముక్క తినకపోతే ఏమైంది ? ప్రాణం కన్నా నాన్ వెజ్ తినడం అంత ముఖ్యం కాదు కదా..

Also Read :పీఎం కేర్స్ కు యూవీ విరాళం

Next Story