పీఎం కేర్స్ కు యూవీ విరాళం

By రాణి  Published on  5 April 2020 2:03 PM GMT
పీఎం కేర్స్ కు యూవీ విరాళం

కరోనా వైరస్ పై పోరాడేందుకు ప్రధాని నరేంద్రమోదీ పీఎం కేర్స్ కు ఎవరికి తోచిన విరాళాలు వారివ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుమేరకు, సినీ, స్పోర్ట్స్, వ్యాపారవేత్తలు ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచినంత విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఆర్ రౌండ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పీఎం కేర్స్ కు రూ.50 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో..ఈ ప్రత్యేకమైన రోజున తాను పీఎం కేర్స్ కు సహాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు యూవీ ట్వీట్ చేశారు. మోదీ ఇచ్చిన పిలుపుకు తాను ఈ రకంగా మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు.‘‘దేశమంతా ఐక్యంగా ఉంటేనే బలంగా ఉంటాం. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ రోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు కొవ్వొత్తులు వెలిగిస్తున్నాను. నాతో మీరు కూడా వెలిగిస్తారా? ఈ ప్రత్యేకమైన రోజున పీఎంకేర్స్‌కు రూ.50 లక్షలు సాయంగా అందిస్తున్నాను. మీరు కూడా వీలైనంత సాయం చేయండి’’ అని యూవీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతకుముందే క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు మద్దతిస్తూ ట్వీట్ చేశారు. ఇతర స్పోర్ట్స్ స్టార్స్, టాలీవుడ్ ప్రముఖులు, సీరియల్ యాక్టర్స్, వ్యాపారవేత్తలు కూడా మోదీకి మద్దతుగా నిలిచారు.Next Story
Share it