తెలంగాణలో నేటి నుంచి భారీ సడలింపులు.. మార్గదర్శకాలు ఇవే

By సుభాష్  Published on  8 Jun 2020 8:02 AM IST
తెలంగాణలో నేటి నుంచి భారీ సడలింపులు.. మార్గదర్శకాలు ఇవే

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడిలో చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక లాక్ డౌన్ 5.0 లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీ నుంచి తెలంగాణలోని కంటైన్మెంట్‌ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో ఆలయాలు, ప్రార్థనమందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గత గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయగా, అందుకు మార్గదర్శకాలను విడుదలచేసింది ప్రభుత్వం. (ఇది చదవండి: టెన్షన్ అక్కర్లేదు.. చిట్టా విప్పిన ఈటెల)

కంటైన్‌మెంట్‌జోన్లలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. రాత్రి సమయాల్లో కర్ఫ్యూ యధివిధిగా ఉంటుందని తెలిపింది. కాగా, ప్రజలందరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపింది. అలాగే ఆలయాలు, రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్‌లలో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలని, ప్రతీ చోట ‌హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సూచించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుందని, ఆస్పత్రులు, ఫార్మసీలు మినహా షాపులన్నీ రాత్రి 8.30 తర్వాత మూసి ఉంచాలని స్పష్టం చేసింది. ఇక 65ఏళ్లుపైబడిన వారు 10 సంవత్సరాల్లోపు పిల్లలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని సూచించింది. (ఇది చదవండి: దేశంలోనే రెండో స్థానం: తెలంగాణలో 55 రకాల కరోనా వైరస్‌లు: జువాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా)

ప్రార్థన స్థలాల వద్ద పాటించాల్సిన నిబంధనలు...

► ప్రార్థనా స్థలాల వద్ద మార్గదర్శకాలు:

► ప్రార్థన స్థలం లోపలికి వెళ్లడానికి ముందే చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి.

► చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్‌ ఏర్పాటు చేయాలి.

► జనాలు గుమిగూడకుండా చూడాలి.

► క్యూలైన్‌ తప్పనిసరి.భౌతిక దూరం పాటించాలి.

► విగ్రహాలు గానీ, పుస్తకాలు, ఇతర వస్తువులను ముట్టుకోరాదు.

► ప్రార్థనకు వెళ్లే భక్తులు సొంత మ్యాట్లు తీసుకెళ్లాలి.

రెస్టారెంట్ల వద్ద మార్గదర్శకాలు:

► రెస్టారెంట్ల ముఖద్వారం థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరి.

► టేక్‌ అవేను ప్రోత్సహించాలి. హోం డెలివరీ చేసే వ్యక్తికి ముందు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి.

► ఫుడ్‌ ప్యాకేట్లను అందించే ముందు ఇంటి గుమ్మం మందే ఉంచాలి. వారి చేతిక అందించకూడదు.

► సీటింగ్‌ కెపాసిటీలో 50శాతం మంది కంటే ఎక్కువ మందిని అనుమతించకూడదు.

► సామాజిక దూరం పాటించేందుకు రెస్టారెంట్ల వద్ద అవసరమైన సిబ్బందిని నియమించాలి.

► స్టీల్‌ గ్లాసులు, ఇతర గ్లాసులకు బదులు డిస్పోజబుల్‌ వస్తువులు వాడటం మంచిది.

► బఫేట్‌ సర్వీస్‌ ఉన్న చోట భౌతిక దూరం పాటించాలి.

► వెయిటర్లు, ఇతర స్టాప్‌ తప్పని సరిగ్గా మాస్కులు, ఫేస్‌ కవర్లు ధరించాలి.

► కిచెన్‌ సాఫ్ట్, టేబుళ్లు ఎప్పటికప్పుడు శానిటైజ్‌తో శుభ్రం చేయాలి.

► వెయిటర్లు, ఇతర స్టాఫ్ తప్పనిసరిగా మాస్క్‌లు, ఫేస్ కవర్లు ధరించాలి

రెస్టారెంట్ల వద్ద పాటించాల్సిన నియమాలు

షాపింగ్ మాల్స్ వద్ద పాటించాల్సిన రూల్స్..

► మాల్స్ వద్ద కస్టమర్లు సామాజికదూరం పాటించేలా చూడడానికి అవసరమైన సిబ్బందిని నియమించాలి

► హోమ్ డెలివరీ చేయడానికి వెళ్లే ముందే డెలివరీ బాయ్‌ను థర్మల్ స్క్రీనింగ్ చేయాలి.

► షాపులో ఒకే సమయంలో తక్కువ మంది కస్టమర్లు ఉండేలా చూడాలి

► రెస్టారెంట్లకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో అలాంటి రూల్స్ షాపింగ్ మాల్స్‌లోని ఫుడ్ కోర్టులకు వర్తిస్తాయి.

► షాపింగ్ మాల్‌లో చెత్త చెదారం పడేయకూడదు.

► షాపింగ్ మాల్‌లో బట్టలు కొనేవాళ్లు ట్రయల్స్ వేయడానికి వీల్లేదు.

హోటళ్లలో పాటించాల్సిన మార్గదర్శకాలు:

► హోటళ్లలో దిగే అతిథులు గుర్తింపు కార్డు, ట్రావెల్‌ హిస్టరీ, మెడికల్‌ నిబంధనలు అన్ని తెలుసుకోవాలి.

► అతిథులు భౌతిక దూరం పాటించేలా వారి కోసం అవసరమైన సిబ్బంది నియమించాలి.

► రిసెప్షన్‌ వద్దనే హ్యాండ్ శానిటైజర్, అందుబాటులో ఉంచాలి.

► నగదు నేరుగా కాకుండా ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సహించాలి

► గెస్ట్‌ హోటల్‌ నుంచి వెళ్లిపోయాక రూమ్‌ శానిటైజ్‌ చేయండం తప్పనిసరి.

► బయట రెస్టారెంట్లలో ఎలాంటి నిబంధనలు ఉంటాయే.. హోటళ్లలో అవే వర్తిస్తాయి.

► హోటళ్లలో రూమ్‌ సర్వీస్‌ అందించే ముందు భౌతిక దూరం పాటించాలి.

► అలాగే హోటళ్లలో ఉండే సిబ్బంది కూడా భౌతిక దూరం పాటించాలి.

► ఒక వేళ ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పనిసరి.

Next Story