జామతో బోలెడు లాభాలు

By సుభాష్  Published on  22 Oct 2020 5:09 PM IST
జామతో బోలెడు లాభాలు

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎన్ని ఆస్తులున్నా.. ఆరోగ్యంగా లేకపోతే కష్టమే. ఈ రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య అధికంగా పెరిగిపోతుందంటున్నారు వైద్య నిపుణులు. కొన్ని మాత్రం పెద్దగా ఖర్చు లేకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక జామకాయలో ఎన్ని పోషకాలుంటాయో తెలిస్తే వాటిని వదలరు. జామ జ్యూస్‌ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాకుండా కాలేయానికి మంచి ఔషధంలా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జామకాయతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ను కంట్రోల్లో ఉంచుతుంది. ముఖ్యంగా షుగర్‌ వ్యాధి ఉన్నవారు జామను తరుచూగా తీసుకుంటే చాలా మంచిదంటున్నారు.

పోషక విలువలు అధికం

జామలో పోషుక విలువలు అధికంగా ఉంటాయి. పైబర్‌ సమృద్దిగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారించడంలో చాలా ఉపయోపగడుతుంది. ఇందులో ఏబీసీ విటమీన్లు, యాంటి ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండటం వల్ల వయసు రీత్య చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి. జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తిపెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయట.

జామలో విటమిన్‌ ఏ, ప్లేవనాయిడ్స్‌ అయిన బీటాకెరోటిన్లైకోపిన్‌ ఉండటం వల్ల ఉపిరితిత్తులకు, చర్మానికి, కంటికి చాలా మంచిది. జామకాయలో ఉండే పోటాషియం గుండె జబ్బులు, బీపీ పెరగకుండా చేస్తాయట. అంతే కాదు జామకాయలో బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.

Next Story