అల్లం రోజూ తింటే ప్రయోజనమేంటి..?

By సుభాష్  Published on  15 Oct 2020 10:35 AM GMT
అల్లం రోజూ తింటే ప్రయోజనమేంటి..?

అల్లం చాలా ఘాటుగా, రుచిగా ఉంటుంది. మన వంటకాల్లో అల్లం వాడుకోవడం సర్వసధారణం. అయితే ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్లంలో జింజెరోల్‌, షోగాల్‌, జింగిబెరిన్‌తోపాటు ఎక్కువ మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందుకే ఈ అల్లంకే ఔషధంగా ఎంతో పేరుంది. దశాబ్దాల కిందట అన్ని రకాల రోగాలను నయం చేసేందుకు అల్లాన్ని వాడేవారు. అల్లంను క్రమంతప్పకుండా మన ఆహారంలో భాగం చేసుకుంటే మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

అల్లం ఉపయోగాలు

అల్లం జింజెరోల్‌ అనే బయో-యాక్టివ్‌ పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఇవి వికారం, వాంతులకు ఎంతో మేలు చేస్తుంది. కీళ్ల వాపును సైతం కూడా తగ్గించే గుణం అల్లంలో ఉంది. అల్లం అనాల్జేసిక్‌ ప్రభావంతో కూడిన పదార్థం. ఇది క్యాన్సర్‌, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అల్లంలోని జింగిబెరేన్‌ జీర్ణక్రియ సాఫీగా ఉండేలా ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా అల్లం యాంటీ డయాబెటిక్‌ గుణాన్ని కలిగి ఉంటుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అల్లం రసాన్ని కొద్దిగా వేడి చేసి నువ్వుల నూనెను,తేనెను, సైంధవ లవణాన్ని కలిపి 2-4 బిందువుల చొప్పున రెండు చెవుల్లోనూ రోజుకు మూడు, నాలుగు సార్లు వేసుకుంటే నొప్పి తగ్గుతుంది. అలాగే రెండు టీ స్పూన్ల అల్లం రసంలో టీస్పూన్‌ తేనె కలిపి ఉదయం, సాయంతర్ రెండుపూటలా తీసుకుంటూ జలుబు తగ్గుతుంది. ఇవే కాకుండా అల్లంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.

Next Story