పెళ్లి ఆగిపోవడానికి కారణమైన 'చీర'..

 Published on  8 Feb 2020 7:02 AM GMT
పెళ్లి ఆగిపోవడానికి కారణమైన చీర..

ఇటీవల చిన్న చిన్న కారణాలతో పెళ్లి మండపాల్లో పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ చిన్న కారణంతో పెళ్లి కొడుకు అలిగి వెళ్లిపోయాడు. దీంతో చేసేది ఏమి లేక పెళ్లిని రద్దు చేశారు వధువు తల్లిదండ్రులు.

కర్ణాటకలోని హసన్ జిల్లాలోని బీదరికెరె గ్రామానికి చెందిన రఘుకుమార్‌.. అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యారు. గురువారం పెళ్లికి జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి బట్టలు కొనేందుకు వధువు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన రఘు.. కాబోయే భార్యకు ఓ చీరను సెలక్ట్ చేశాడు. అయితే రఘు సెలక్ట్ చేసిన చీరను కాదని..అమ్మాయి తరుపు బంధువులు తమకు నచ్చిన చీరనే కొనుగోలు చేశారు.

మనస్తాపానికి గురైన రఘు సరిగ్గా పెళ్లి సమయానికి కనిపించకుండా ఎటో వెళ్లిపోయాడు. అతని కోసం ఎంత గాలించినా ఫలితం కనబడలేదు. పెళ్లి సమయం మించి పోవడంతో చేసేది ఏమి లేక పెళ్లిని వాయిదా వేశారు. అనంతరం పెళ్లి కూతురి తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి రఘు పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story
Share it