న్యూఢిల్లీ: ఢిల్లీని వాయు కాలుష్యం వదలడం లేదు. దీనిపై పార్లమెంట్ ప్యానల్ సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి ప్రముఖ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ డుమ్మా కొట్టాడు. గౌతమ్ డుమ్మా కొట్టడంపై ఆప్ పార్టీ మండిపడింది. గౌతమే కాదు పలువురు అధికారులు, ఎంపీలు కూడా డుమ్మా కొట్టారు. 29 మంది ఎంపీలకుగానూ నలుగురు మాత్రమే హాజరయ్యారు. దీనిపై పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు కాని ఎంపీలపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇక గౌతమ్ గంభీర్ సమావేశానికి హాజరు కాకుండా ఇండోర్‌లో క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లాడు. జిలేబీలు తింటూ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాడు. దీనిపై ఢిల్లీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.