ఆర్టీసీ కార్మికులకు షాక్ : జీతాలకు డబ్బుల్లేవని హైకోర్ట్‌కు చెప్పిన ప్రభుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 9:14 AM GMT
ఆర్టీసీ కార్మికులకు షాక్ : జీతాలకు డబ్బుల్లేవని హైకోర్ట్‌కు చెప్పిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జీతాలు చెల్లించడానికి డబ్బుల్లేవని హై కోర్ట్‌కు చెప్పింది ప్రభుత్వం. ఆర్టీసీ దగ్గర కార్మికులకు చెల్లించేంత డబ్బులేదని అడ్వొకేట్ జనరల్ వాదించారు. ఆర్టీసీ దగ్గర రూ.7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కార్మికులకు జీతాలు చెల్లించాలంటే రూ.224 కోట్లు అవసరమన్నారు. ఉద్యోగాల జీతాలపై మధ్యాహ్నం తరువాత మరోసారి విచారణ జరుపుతామని హైకోర్ట్ చెప్పింది.

గతంలో జీతాలపై స్పందించిన హైకోర్ట్..సోమవారం జీతాలు చెల్లించాలని ఆదేశించింది. అప్పుడు ట్రెజరీ ఉద్యోగులు అందుబాటులో లేరని కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story