ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర
By Newsmeter.Network Published on 29 March 2020 11:07 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. మూడు నెలల కాలానికి ప్రభుత్వ ఖర్చుల నిమిత్తం రూ. 70వేల 994కోట్ల 98లక్షల 38వేల విలువైన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర పడింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈనెలాఖరు వరకు బడ్జెట్‌ను ఏపీ అసెంబ్లిలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా మార్చి 29న బడ్జెట్ సమావేశాలునిర్వహించాలని ముందు భావించారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా ఏపీలోనూ లాక్‌డౌన్ కొనసాగుతుంది.
Also Read :లాక్ డౌన్ కఠిన నిర్ణయమే.. అది మీ రక్షణ కోసమే
ఈ పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో గత మూడు రోజల క్రితం ఏపీ కేబినెట్ సమావేశమై.. మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్‌ను కేటాయించింది. దీనిని గవర్నర్ ఆమోదానికి పంపించింది. దీంతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆర్డినెన్స్‌కు ఆమోముద్ర వేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు ఆమోదం తెలుపుతూ రాజ్ భవన్ కార్యాలయం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు నెలల ప్రభుత్వ ఖర్చుల కోసం రూ.70వేల 994 కోట్ల 98 లక్షల 38వేల విలువైన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేశారు.