కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కొత్తగా వచ్చే గర్భిణిలకు వైద్యం చేసేందుకు నిరాకరిస్తుండటంతో వెనుతిరిగి వెళ్లిపోతున్నా గర్భిణీలు. తమకు వైద్యం ఎందుకు అందించడం లేదని ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. కరోనా కారణంగా తాము కొత్త రోగులకు వైద్యం అందించలేమని చెప్పిన వైద్యులు. వ్యయ ప్రయాసాలకు ఓర్చి వైద్యం కోసం దూర ప్రాంతాల నుంచి వస్తే బలవంతంగా వెల్లగొట్టడం దారుణమంటూ గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేశారు.