'సైరా' రిలీజ్ ఉన్న‌ప్ప‌టికీ.. అందుకే 'చాణ‌క్య‌'ను రిలీజ్ చేసాం - హీరో గోపీచంద్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 1:38 PM GMT
సైరా రిలీజ్ ఉన్న‌ప్ప‌టికీ.. అందుకే చాణ‌క్య‌ను రిలీజ్ చేసాం - హీరో గోపీచంద్

హీరోగా ప‌రిచ‌య‌మై.. ఆత‌ర్వాత విల‌న్ గా మారి... మ‌ళ్లీ హీరోగా సినిమాలు చేస్తూ... స‌క్స‌స్ సాధించిన హీరో గోపీచంద్. అయితే.. ఇటీవ‌ల కాలంలో గోపీచంద్ చేసిన సౌఖ్యం, గౌత‌మ్ నంద‌, ఆక్సిజ‌న్, ఆర‌డుగుల బుల్లెట్టు, పంతం.. సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. దీంతో త‌న కెరీర్ లో విజ‌యం అనేది కీల‌కంగా మారిన ఈ స‌మ‌యంలో 'చాణ‌క్య' అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా హీరో గోపీచంద్ తో ఇంట‌ర్ వ్యూ మీ కోసం..

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుంది.?

ఫ్యామిలీస్ కోరుకునే ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాలో ఉంది. మంచి యాక్షన్ ఉంది అలాగే సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది. ఆ ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.

ఈ జోనర్‌లో ఫస్ట్ టైమ్‌ సినిమా చేశారు కదా..?

అవునండీ. నేను ఇప్పటివరకూ స్పై థ్రిల్లర్‌, రా ఏజెంట్‌ జోనర్‌లో సినిమా చేయలేదు. అందుకే దర్శకుడు తిరు కథ చెప్పగానే వెంటనే కనెక్ట్‌ అయ్యాను. తను చాలా ఇంట్రెస్టింగ్‌గా నేరేట్‌ చేశారు. ఫస్ట్‌ నుండి చివరి వరకు ఆ ఇంట్రెస్ట్‌ అలాగే సస్టేన్‌ అయ్యింది. ఎండ్‌ కార్డ్‌ పడే వరకూ ఆడియన్స్‌కి కూడా డెఫినెట్‌గా ఆ టెన్షన్‌ రన్‌ అవుతూనే ఉంటుంది.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?

సినిమాలో నేను అర్జున్‌ అనే రా ఏజెంట్‌గా కన్పిస్తాను.

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి.?

చాణక్య అనేది మా మిషన్‌ పేరు. చాణక్య అంటే ఇంటెలిజెన్స్‌. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ ఇంటెలిజెన్స్‌ని ఎలా ప్లే చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందుకే టైటిల్‌ చెప్పగానే ఈ సబ్జెక్ట్‌కి యాప్ట్‌ అనిపించింది. ఆ మిషన్‌ ఏంటనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఇంటెలిజెన్స్‌ ఉన్నప్పటికీ సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా సినిమా ఉంటుంది. ఎలా అంటే ఈ సినిమాలో కొంత పార్ట్‌ పాకిస్థాన్‌లో ఉంటుంది. యాక్చువల్లీ తీయాలంటే పాకిస్థాన్‌లో తెలుగు మాట్లాడరు. కానీ ప్రేక్షకుల సౌఖ‌ర్యం కోసం తెలుగులో మాట్లాడించడం జరిగింది.

మీకు ఏ జోనర్‌ సినిమాలంటే ఇష్టం.?

నాకు యాక్షన్‌ మూవీస్‌ అంటే ఇష్టం. దాంతో పాటు ఈ యాక్షన్‌ మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు లవ్ ట్రాక్‌ కలిపారు. అది ఆడియన్స్‌కి ఫ్రెష్‌ ఫీల్‌ కలిగించేలా ఉంటుంది.

గోపీచంద్ అంటేనే మాస్. మరి ఈ సినిమాలో యాక్షన్ ఎంతవరకు ఉంటుంది ?

ఇది యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్. మీరు ఆశించిన్నట్లుగానే సినిమాలో యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే గుడ్ ఫన్ కూడా ఉంటుంది. ఫిల్మ్ లో లాస్ట్ సీన్ వరకూ వాట్ నెస్ట్ అనే ఒక ఇంట్రస్ట్ ఉంటుంది.

మీ గత సినిమాల కన్నా ఇందులో మోస్ట్‌ గ్లామరస్‌గా కన్పిస్తున్నారు?

నన్ను మా సినిమాటోగ్రాఫర్‌ వెట్రి అంత గ్లామర్‌గా చూపించారు. సినిమాకి ఆయన ఫొటోగ్రఫీ మంచి ఎస్సెట్‌ అవుతుంది.

ఇండస్ట్రీ ప్రముఖుల కోసం స్పెషల్‌ షో వేశారని తెలుస్తోంది?

సినిమా రిలీజ్‌కి ముందు ఫైనల్‌గా వారి జడ్జిమెంట్‌ తీసుకుందామని మాకు బాగా క్లోజ్‌ సర్కిల్‌, వెల్‌ విషర్స్‌కి షో వేశాం. యునానిమస్‌గా ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అన్నారు. ఆడియన్స్‌ నుండి కూడా అలాంటి రెస్పాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం.

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఫస్ట్ టైమ్‌ చేస్తున్నారు కదా?

అనీల్‌ సుంకర ఒక ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటారు. చివరి మూమెంట్‌ వరకు కూడా సినిమాకు ఇంకా బెటర్‌గా ఏమైనా చెయ్యగలమా అని తపనపడే వ్యక్తి. అలాంటి ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌ మన ఇండస్ట్రీకి చాలా అవసరం. అనీల్‌గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఈ సినిమాలో మీరు బాగా ఎంజాయ్‌ చేసిన సీన్ ఏంటి..?

సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్రాక్‌ ఒకటి ఉంటుంది. అది బాగా ఎంజాయ్‌ చేస్తూ చేశాను. సునీల్‌, రఘుబాబు, ఆలీ, హీరోయిన్‌ కాంబినేషన్‌లో ఆ ట్రాక్‌ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్‌. నాతో పాటు ప్రతి ఒక్కరూ ఎంతో ఎంజాయ్‌ చేస్తూ చేశారు.

ఈ సినిమాలో యాక్షన్‌ పార్ట్‌ చేసేటప్పుడు మీకు గాయం అయింది కదా..?

జైసల్మేర్‌లో షూటింగ్‌ చేసేటప్పుడు ఇంకో నాలుగు షాట్స్‌ అయితే షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుందనగా లాస్ట్‌ షాట్‌లో బైక్‌ స్కిడ్‌ అయ్యి నాకు గాయం అయ్యింది. ఇంకొంచెం ఉంటే షూటింగ్‌ అయిపోయేది కదా అని ఆ టైమ్‌లో బాధ వేసింది.

తమిళ్‌ డైరెక్టర్‌ కదా? ఆ ఫ్లేవర్‌ ఎంత వరకు ఉంటుంది.?

నేను నలుగురు తమిళ్‌ డైరెక్టర్స్‌తో వర్క్‌ చేశాను. నాకెప్పుడూ అలాంటి డిఫరెన్స్‌ ఏం కనిపించలేదు. సినిమా స్టోరిని బట్టే ఆ ఫ్లేవర్‌ ఉంటుంది. తిరు తెలుగువాడే. అక్కడ సెటిల్‌ అయ్యారు. కమర్షియల్‌ వేలో సినిమాని ఎలా హ్యాండిల్‌ చెయ్యాలనేది ఖచ్చితంగా తెలిసిన డైరెక్టర్‌.

'సైరా'కి 'చాణక్య'ను పోటీగా ఎందుకు విడుదల చేస్తున్నారు ?

నిజానికి చాణక్య మూవీని మేము మే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేసాం కానీ, నేను గాయపడిన తరువాత షూటింగ్ ఆలస్యం అయింది. ఇక ఆ తరువాత, అక్టోబర్ 3న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాం. అప్పటికీ సైరా విడుదల తేదీ ప్రకటించలేదు. ఇక సైరా అక్టోబర్ 2 విడుదల అని ప్రకటించాక, మేము అక్టోబర్ 5న చాణక్య రిలీజ్ ప్లాన్ చేశాం. దసరా హాలిడేస్ కాబట్టి చాణక్యను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. పైగా చాణక్య మరియు సైరా రెండు సినిమాలు వేరు వేరు నేపథ్యాలకి సంబంధించిన సినిమాలు.

ప్యాన్‌ ఇండియా మూవీ చేసే అవకాశం ఉందా..?

తప్పకుండా ఉంది. ఎందుకంటే గేట్స్‌ ఓపెన్‌ అయ్యాయి కాబట్టి మనం వెళ్ళడానికి ఛాన్స్‌ ఉంది. కథ బాగుంటే ఆడియన్స్‌ డెఫినెట్‌గా రిసీవ్‌ చేసుకుంటారు.

ఇందులో సంగీతానికి ఎంత ఇంపార్టెన్స్‌ ఉంటుంది..?

స్పై థ్రిల్లర్‌ జోనర్‌ కాబట్టి సంగీతానికి, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సినిమా చేసిన తర్వాత ఆ డబుల్‌ పాజిటివిటీ చూసి తిరుతో ఒక్కటే అన్నాను. నువ్వు చెప్పింది యాజిటీజ్‌గా ప్రజెంట్‌ చేస్తావ్‌. కానీ ఈ సినిమా బ్యాక్‌బోన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కాబట్టి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు అన్నప్పుడు.. తను శ్రీచరణ్‌ పాకాల గురించి చెప్పారు. శ్రీచరణ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌గా చేశారు.

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

బివిఎస్‌ఎన్‌ ప్రసాద్ గారితో బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. అది అడ్వంచరస్‌ స్టోరి. నా సినిమాలకు నెక్స్‌ట్‌ మోడ్‌లో ఉంటుంది. అలాగే సంపత్‌ నంది దర్శకత్వంలో కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తున్నాను. రెండు స్టోరీలు దేనికదే కాంట్రాస్ట్‌గా ఉంటాయి.

Next Story