ఆ విషయంలో ఇండియాను ఫాలో అవ్వమంటున్న గూగుల్

By రాణి  Published on  15 Dec 2019 11:03 AM GMT
ఆ విషయంలో ఇండియాను ఫాలో అవ్వమంటున్న గూగుల్

అభివృద్ధి విషయంలో మనం ఇతర దేశాలను ఫాలో అవుతుంటాం. నిజానికి మంచికన్నా చెడుకే ఎక్కువ ఫాలో అవుతుంటారు ఎవరైనా..ఫ్యాషన్, పబ్ కల్చర్ వంటి వాటికి తొందరగా అలవాటు పడిపోవడం సహజం. అయితే బ్యాంక్ చెల్లింపుల విషయంలో మీరు ఇండియానే ఫాలో అవ్వండి అని గూగుల్ అమెరికాకు సూచించిందట.

యూపీఐ...ఈ పేమెంట్ ఆప్షన్ వచ్చాక దేశంలో సగానికి పైగా ప్రజలకు బ్యాంకులకు వెళ్లాల్సిన పనేలేదు. ఏ బ్యాంకు నుంచైనా దీని ద్వారా ఇతర బ్యాంకులను నగదును పంపించే సదుపాయం ఇందులో ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఆన్ లైన్ చెల్లింపుల విధానాల్లో ఇదే బెస్ట్. భీమ్ యాప్‌గానీ, గూగుల్, పేటీఎం, ఫోన్‌పే యాప్‌లతోగానీ సులువుగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయచ్చు. కావాల్సిందల్లా.. ఓ బ్యాంక్ ఎకౌంట్, ఆ అకౌంట్‌కు లింకై ఉన్న ఓ ఫోన్ నెంబర్. నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వాటికన్నా ప్రజలు యూపీఐనే ఎక్కువగా ఆదరిస్తున్నారు.

అయితే అమెరికా ప్రభుత్వం కూడా ఇప్పుడు 'ఫెడ్ నౌ' పేరుతో అక్కడి ప్రజల కోసం ఓ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోందట. ఈ క్రమంలోనే గూగుల్ వినియోగదారుల వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ మార్క్ ఇసాకోవిస్జ్ అమెరికా సెంట్రల్ బ్యాంక్ కు ఓ లేక రాశారట. ఇండియాలో డిజిటల్ చెల్లింపుల్లో విజయవంతమైన యూపీఐ చెల్లింపుల గురించి ఆ లేఖలో వివరించారు.

ఈ పద్ధతి (యూపీఐ) ద్వారానే ఫెడ్ నౌ ను కూడా అభివృద్ధి చేయవచ్చని ఆ లేఖ సారాంశం. అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకున్నాకే ఇండియాలో డిజిటల్ పేమెంట్ల కోసం యూపీఐ ను తీసుకొచ్చామని, అందుకే ఇది పెద్ద సక్సెస్ సాధించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ''దీని విజయానికి మూడు విశిష్టతలే కారణం. ఓ బ్యాంక్ ‌నుంచి మరో బ్యాంక్‌కు నేరుగా డబ్బులు ట్రాన్ఫర్ చేయగలగడం. ఈ ట్రాన్ఫర్ రియల్ టైంలో జరగడం. యూపీఐ ఆధారంగా టెక్ కంపెనీలు సునాయసంగా యాప్‌లు తయారు చేసి కస్టమర్లకు చేరువ అవ్వడం.'' అని మార్క్ యూపీఐ ప్రత్యేకతలను ఆ లేఖలో వివరించారు. దీంతో ఇప్పటి వరకూ అనేక విషయాల్లో అమెరికా విధానాలను చూసి స్ఫూర్తి పొందిన ఇండియా ఇప్పుడు ఆ అగ్రరాజ్యాన్ని ఆశ్చర్యపరిచేంతలా ఓ వ్యవస్థతో ముందుకు రావడం అభినందనీయమంటున్నారు కొందరు విశ్లేషకులు.

Next Story