గురువారం జరిగిన బ్రిటన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో మరోసారి బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 650 స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 326 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది.
జాన్సన్ నేతృత్వంలో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు ముందే వెల్లడించాయి. అయితే ప్రతిపక్ష లేబర్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయింది. లేబర్ పార్టీకి ఇది చీకటిరోజుగా మిగిలిపోతుంది. దీంతో ఆ పార్టీ అధినేత జెరెమీ కార్బిన్ తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ”భవిష్యత్తులో ఎన్నికల ప్రచారం చేసేందుకు తాను నాయకత్వం వహించలేను” అంటూ కార్బిన్ ఆవేదన చెందారు.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవడంతో జరిగిన ఈ ఎన్నికలు బ్రెగ్జిట్ ఎన్నికలుగా ప్రచారమయ్యాయి. బ్రెగ్జిట్ అంశంపై పార్లమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రధాని జాన్సర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. అయితే సుమారు 100 ఏళ్ల తర్వాత యూకేలో మధ్యంతర ఎన్నికలు జరగడం విశేషం. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాన్సన్ విజయాన్ని అభినందిస్తూ..మరోసారి ప్రధాని అయినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort