ఏపీలో అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2020 11:03 AM IST
ఏపీలో అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం..

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్సు రైలు నాయుడుపాలెం-బాపూజీనగర్ మధ్య సూరారెడ్డి పాలెం వద్ద వంతెన దాటుతుండగా చివరన బోగీలు విడిపోయి మంటలు అంటుకున్నాయి. ట్రాక్ కుంగిపోవడంతో బోగీలు పట్టాలు తప్పాయి. దాంట్లో డీజిల్‌ ఉండడంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రూ.80లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే.. 200మీటర్ల మేర రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

Next Story