రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..!

By సుభాష్  Published on  21 Sept 2020 8:01 PM IST
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..!

రైతులకు కేంద్ర సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2021-22 సంవత్సరానికి ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రకటన చేశారు. గోధుమ పంట కనీస మద్దతు ధర రూ.50 పెంచడం వల్ల క్వింటాల్‌ రూ.1,975కు చేరింది. అలాగే మరి కొన్ని పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శనగలు క్వింటాలుకు రూ.225, మసూర్‌ దాల్‌ క్వింటాలుకు రూ.300, ఆవాలు క్వింటాలుకు రూ.225, బార్లీ క్వింటాలుకు రూ.75, కుసుమలు క్వింటాలుకు రూ.112 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చినా కనీస మద్దతు ధర కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

కేంద్ర సర్కార్‌ ఎల్లప్పుడు రైతుల గురించే ఆలోచిస్తుందని, వారికి మేలు చేసే విధంగా చర్యలు చేపడుతుందని అన్నారు. కానీ కొన్ని పార్టీల నేతలు తమ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటివి మానుకోవాలని ఆయన హితవు పలికారు. మోదీ ప్రభుత్వం ముందుగా రైతుల సమస్యలను తీర్చే విధంగా ముందుకు సాగుతుందని అన్నారు.

Next Story