తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని విలీనం చేయాలని, అలాగే ఉద్యోగ భద్రత కోసం రెండు నెలల పాటు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కాగా,  కార్మికుల ఉద్యోగ భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల బదిలీ, ఓడి, ఇతర విషయాలపై చర్చలు జరుగుతున్నాయని సునీల్‌ శర్మ చెప్పారు. ప్రస్తుతం ప్రతినెలా రూ. 80 నుంచి 90 కోట్ల ఆదాయం వస్తోందని, ఇదంతా ఉద్యోగుల సమిష్టి కృషితోనే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ఇదే విధంగా కొనసాగితే డిసెంబర్‌లో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, అధికంగా ఇంధనం పొదుపు చేసిన 11 మంది డ్రైవర్లకు ఎండీ కేఎంపీఎల్‌ అవార్డులతో సత్కరించారు.

పీఎఫ్‌ బకాయిలను తొందర్లోనే చెల్లిస్తాం

పీఎఫ్‌ బకాయిలను తొందర్లోనే చెల్లిస్తామని శర్మ స్పష్టం చేశారు. కార్గో సర్వీసులను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.