పేటీఎం కస్టమర్లకు శుభవార్త
By సుభాష్
తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది పేటీఎం. ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీస్ (ఏపీఈ)ను ఆవిష్కరించింది. దీని ద్వారా ఆధార్ కార్డుల ద్వారా క్యాష్ విత్ డ్రా, బ్యాలెన్స్ ఎంక్వయిరీ లాంటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధార్‌తో అనుసంధానం అయిన దేశంలో బ్యాంక్ ఖాతా కలిగిన వారు ఎవరైనా ఏఈపీఎస్ సర్వీసులతో క్యాష్ విత్ డ్రాయల్స్, బ్యాలెన్స్ విచారణ వంటి సేవలు పొందే అవకాశం ఉందని కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలో క్యాష్ డిపాజిట్, ట్రాన్స్‌ఫార్ లాంటి సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
ఈ ఏఈపీఎస్ సర్వీసులతో దేశంలో ఆర్థిక సేవలను వేగవంతం చేయడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. దేశంలోని మారుమూల ప్రాంతంలోని ప్రజలు పూర్తి బ్యాకింగ్ సేవలను పొందే విధంగా చర్యలు చేపడుతున్నామని పేటీఎం పేర్కొంది. ఇందు కోసం పదివేలకుపైగా వ్యాపార కరస్పాండెంట్లతో భాగస్వామ్యం చేసుకున్నంట్లుగా పేటీఎం చెల్లింపుల బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.