తమిళనాడు: చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 2.4 కిలోల బంగారాన్ని, రూ.7 లక్షల విలువైన యూఎస్ డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్, మలేషియా, శ్రీలంక నుంచి బంగారం తరలిస్తున్న ఏడుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్‌పోర్టులో ఒక మిలియన్ డాలర్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు జప్తు చేశారు. నిందితులు సోండా మహ్మద్ అలీ, అన్సారీ, సయ్యద్ మహ్మద్, ఫరూఖ్, సయ్యద్ అబ్తాకీ, మహ్మద్ అలీ, అబ్దుల్ హకీమ్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.