పరుగులు పెడుతున్న బంగారం ధర
By సుభాష్ Published on 25 April 2020 11:23 AM ISTబంగారం ధర పైకెక్కనుంది. కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర .. మళ్లీ పరుగులు పెడుతోంది. ఈ రోజు కూడా బంగారం ధర భారీగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల కారణంగా భారత్‌లో కూడా పెరుగుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక బంగారం దారిలో కూడా వెండి పయనిస్తోంది.
హైదరాబాద్‌లో శనివారం బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 510 పెరిగి, రూ.45,820కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 890 పెరిగి రూ. 42,520కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా అంతే. కిలో వెండి ధర రూ.120 పెరిగి. రూ. 42,540కి ఎగబాకింది.
ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 420 పెరిగి, రూ. 45, 920కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 240 పెరుగుదలతో రూ. 43,100కు చేరింది. ఇక వెండి ధర రూ.120 పెరిగి, రూ. 42,540కి చేరుకుంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర ఎగబాకింది. పసిడి ధర ఔన్స్‌కు 0.02 శాతం ఎగబాకింది. దీంతో ఔన్స్‌కు 1745.65 డాలర్లకు చేరుకుంది. ఇక వెండి ధర మాత్రం తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.01శాతం తగ్గుదలతో 15.35 డాలర్లకు క్షించింది.