గోల్డ్‌ రికార్డ్.. వరుసగా ఐదో రోజు పెరిగిన బంగారం ధరలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2020 2:06 PM GMT
గోల్డ్‌ రికార్డ్.. వరుసగా ఐదో రోజు పెరిగిన బంగారం ధరలు

శ్రావణమాసం వచ్చింది అంటే మగువలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా వరకు ప్రజలు బయటకు రావడం లేదు. అయినప్పటికి బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఐదో రోజుకు కూడా అమాంతం పెరిగాయి. ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర కొత్త ఆల్‌టైకి హైని అందుకుంది. కేజీ వెండి ధర రూ.3626 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం కొత్త రికార్డు స్థాయిని అందుకోవడంతో పాటు నేడు స్టాక్‌ మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌ బంగారానికి డిమాండ్‌ను పెంచాయి. అలాగే రానున్న రోజుల్లో పెళ్లిళ్ల, పండుగల సీజన్‌ కారణంగా బంగారం ధర మరింత పెరిగినట్లు బులియన్‌ పండితులు చెబుతున్నారు.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.260 పైకి కదిలింది. దీంతో ధర రూ.52,220కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.260 పెరుగుదలతో రూ.49,050కు ఎగసింది. పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.160 పైకి కదిలింది. దీంతో ధర రూ.61,210కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Next Story