రికార్డ్‌ స్థాయిలో భారీగా పెరిగిన బంగారం ధర

By సుభాష్  Published on  28 April 2020 9:31 AM IST
రికార్డ్‌ స్థాయిలో భారీగా పెరిగిన బంగారం ధర

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గినా కూడా దేశంలో మాత్రం పరుగులు పెట్టడం గమనార్హం. పసిడి ధర పెరగడం ఇది వరుసగా ఐదో రోజు. వెండి మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది.

హైదరాబాద్‌ మార్కెట్లో మంగళవారం పసిడి ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.970 ఎగబాకి ప్రస్తుతం రూ.45,900కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2120 పెరిగి రూ. 44,740కు ఎగబాకింది.

ఇక బంగారం పరుగుతు పెడుతూ వెండి మాత్రం అందకు భిన్నంగా ఉంది. కిలో వెండి ధర రూ.400 దిగివచ్చి ప్రస్తుతం రూ. 42,200లకు చేరుకుంది. నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్ల నుంచి భారీగా డిమాండ్‌ పెరగడంతోనే ధరల పెరగడానికి కారణమని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2030 ఏగబాకి రూ.45,150కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1620 పెరిగి రూ. 47,650కి చేరింది.

Next Story