బెంగాల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ బంగారమెంత?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 9:25 AM GMT
బెంగాల్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ బంగారమెంత?

పశ్చిమ బెంగాల్‌లో రెండు వేరు వేరు చోట్ల భారీగా బంగారం పట్టుబడింది. సిలిగురి, హౌరాలో ఆదివారం నాడు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న రూ.2.50 కోట్ల విలువైన ఆరు కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన సంజ్‌రాయ్‌ న్యూజల్పాయిగురి రైల్వేస్టేషన్‌ నుంచి టీస్టా-తోర్సా ఎక్స్‌ప్రెస్‌లో 1.5 కిలోల బంగారాన్ని తరలిస్తుండగా డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడ్డాడు. ఇతనితో సంబంధం ఉన్న మరో వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కామాఖ్యాపురి ఎక్స్‌ప్రెస్‌లో 3.321 కిలోగ్రాముల బంగారాన్ని మిజోరాంకు చెందిన ఇద్దరు వ్యక్తలు అక్రమంగా తరలిస్తూ హౌరౌ రైల్వేస్టేషన్‌లో పట్టుబడ్డారు. నలుగురు నిందితులపై కస్టమ్స్‌ నిబంధనల ప్రకారం డీఆర్‌ఐ అధికారులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story