క్రికెటర్ మాక్స్‌వెల్‌ సంచలన నిర్ణయం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 7:23 AM GMT
క్రికెటర్ మాక్స్‌వెల్‌ సంచలన నిర్ణయం..!

సిడ్నీ: ఆసీస్‌ ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జట్టులో మంచి ఫామ్‌లో ఉన్నమాక్స్‌వెల్‌.. ఉన్నట్టుండి అంతర్జాతీయ క్రికెట్ట్ నుంచి విరామం ప్రకటించాడు. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగానే మాక్స్‌వెల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సైకాలజిస్ట్‌ డాక్టర్‌ మైఖెల్‌ తెలిపారు. మాక్స్‌వెల్‌ తన ఆరోగ్యం విషయంలో 'మానసిక ఆరోగ్యానికి' సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. అందువల్లే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని.. మైఖెల్‌ వెల్లడించారు.

అయితే ప్రస్తుతం ఆసీస్‌, శ్రీలంక జట్ల మధ్య టీ20 సీరిస్‌ జరుగుతోంది. ఈ మేరకు తొలి టెస్ట్‌లో మాక్స్‌వెల్‌ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. 28 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టును వియపథంలో నడిపించాడు. రెండో టీ20 మ్యాచ్‌లో ఆసీస్‌ ఒక్క వికెట్‌ కూడా కొల్పోకుండా విజయం సాధించింది. దీంతో మాక్స్‌వెల్‌ కు బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాలేదు.

అయితే మాక్స్‌వెల్‌ నిర్ణయంతో..3 టీ20 మ్యాచ్‌లో అందుబాటులో ఉండడు. దీంతో అధికారులు అతని స్థానంలో డార్సీ షార్ట్‌కు జట్టులో స్థానం కల్పించనున్నారు.

Next Story
Share it