చిత్తూరులో దారుణం... బాలిక కిడ్నాప్

By Newsmeter.Network  Published on  5 Dec 2019 7:22 AM GMT
చిత్తూరులో దారుణం... బాలిక కిడ్నాప్

దేశంలో ఆడవారికి భద్రత లేకుండా పోతోంది. ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసు, తాజాగా హైదరాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనతో సమాజం భగ్గుమంటోంది. దిశా ఘటన తర్వాత మహిళా లోకం మరోసారి రోడ్డెక్కి నినదిస్తోంది. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న మృగాళ్లపై కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో ఓ ఇంటర్ ఓ బాలిక కిడ్నాప్‌కు గురైంది. బాలిక కిడ్నాప్‌పై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటర్ సెకండియర్ చదువుతున్న బాలికను సతీష్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, సతీష్‌ బాలికను వెంబడించి కారులో తీసుకెళ్లాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బాలిక కోసం గాలిస్తున్నారు. పీలేరు-కడప రోడ్డులోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

దీంతో బాలిక కుటుంబీకులు పోలీసుస్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని బాలికను తమకు అప్పగించి, నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ఇలాంటి ఘటనపై మహిళలు తీవ్రస్థాయిలోమండిపడుతున్నారు. అత్యాచారాలు, హత్యలు చేస్తున్నవారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story
Share it