రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రేమజంట మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి కేశంపేట్‌ మండలం తొమ్మిది రేకుల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వేళ్తే.. ఒకే గ్రామానికి చెందిన నాగిళ్ల శ్రీరామ్‌, సుశీల గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం సుశీల తల్లిదండ్రులకు తెలిసింది. ఈ నేపథ్యంలో సుశీలను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సుశీల ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రియురాలు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న శ్రీరామ్‌ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ప్రియురాలు లేని చోట బతకలేనని గ్రామశివారులోని మర్రి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమజంట చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

అంజి గోనె

Next Story