జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్: రికార్డు స్థాయిలో చెత్త సేకరణ..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Nov 2019 12:45 PM GMT
హైదరాబాద్: నిరుపయోగ వస్తువుల సేకరణకు జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత తొమ్మిదిరోజులుగా 213.811 మెట్రిక్ టన్నుల నిరుపయోగ వస్తువులను జీహెచ్‌ఎంసీ సేకరించింది. నేడు ఒక్కరోజే 27.803 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించింది. ఇవాళ కూడా నగరంలోని పలు వార్డుల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో జీహెచ్‌ఎంసీ సిబ్బందికి తమ ఇంట్లో మూలకుపడ్డ వస్తువులైన ఎలక్ట్రానిక్, ఫర్నీచర్ వ్యర్థాలు, పనికిరాని పరుపులు, విరిగిన కుర్చీలు, బల్లాలు, ప్లాస్టిక్ వస్తువులను పెద్ద ఎత్తున అందజేశారు. ఇప్పటి వరకు సేకరించిన వ్యర్థాలను 80.301 మెట్రిక్ టన్నులను సేకరించడం ద్వారా ఎల్బీనగర్ జోన్ అగ్రస్థానంలో నిలిచింది. సికింద్రాబాద్ జోన్ 51.774 మెట్రిక్ టన్నులను సేకరించి ద్వితీయ స్థానంలో నిలువగా 22.098 మెట్రిక్ టన్నులతో శేరిలింగంపల్లి, 23.508 మెట్రిక్ టన్నులతో కూకట్ పల్లి జోన్, 20.754 మెట్రిక్ టన్నులతో చార్మినార్, 15.376 మెట్రిక్ టన్నులతో ఖైరతాబాద్ జోన్‌లు నిలిచాయి. కాగా రేపటితో ఈ ప్రత్యేక డ్రైవ్ ముగియనున్నది.