ఇండిగో విమానంలో జర్మనీ దేశస్తుడు హల్‌చల్
By Medi SamratPublished on : 11 Oct 2019 6:58 PM IST

గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో జర్మనీ దేశస్తుడు హల్‌చల్ చేశాడు. ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం పలు కారణాల వల్ల శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. కాగా విమానంలోని బాత్‌రూమ్‌లో బట్టలు లేకుండా తిరుగుతున్న విదేశీయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో పోలీసుల కళ్లుగప్పి విదేశీయుడు పరారయ్యాడు. పోలీసులు విదేశీయుడి కోసం గాలిస్తున్నారు.
Next Story