ముఖ్యాంశాలు

  • హైదరాబాద్ లో లింగ నిర్ధరణ పరీక్షలు
  • మంజుసుధ ఆస్పత్రిపై పోలీసుల దాడి
  • మంజు సుధ ఆస్పత్రిని సీజ్ చేసిన పోలీసులు

 

హైదరాబాద్ : లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆస్పత్రిపై పోలీసులు దాడులు జరిపారు. దిల్ షుఖ్ నగర్ లోని మంజుసుధ ఆస్పత్రిలో పోలీసులు సోదాలు చేశారు. గర్భవతులకు లింగనిర్ధారణ చేస్తున్నట్లు సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. పరీక్షలు చేసి పుట్టేది మగ, ఆడ పిల్ల చెప్పి సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారంతో షీ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. షీ టీమ్స్, చైతన్యపురి పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. అడ్డంగా బుక్ అయిన ఆస్పతి యాజమాన్యంపై కేసు నమోదు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు.

ముందుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట వ్యతిరేకం. దీనికి సంబంధించి చట్టాలు చాలా కఠినంగా అమలవుతున్నాయి. కాని..కొంత మంది కాసులకు కక్కుర్తి పడి లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలితే కఠిన శిక్ష కు గురి అవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.