తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనలో గ్యాస్‌ లీకేజీ అదుపులోకి వచ్చింది. ఉప్పూడి గ్రామంలో మడ్‌ డంపింగ్‌తో లీకేజీని ఓన్జీసీ నిపుణులు అదుపులోకి తెచ్చారు. రసాయనాలతో కూడిన బురదను పంపింగ్‌ చేసి గ్యాస్‌ లీకేజీని నిపుణులు ఆపారు. ఎట్టకేలకు ముంబై బృందం ఆపరేషన్‌ ఫలించింది. సుమారు 80 వేల లీటర్ల బురదనీటిని లీకవుతున్న ప్రదేశానికి పంపి గంటా 40 నిమిషాల్లో గ్యాస్‌ను నిపుణులు అదుపు చేశారు. దీంతో ఉప్పూడి పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఓఎన్జీసీ గ్రూప్‌ మేనేజర్‌ ఆదేశ్‌కుమార్‌ గ్యాస్‌ నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు. కాగా గత మూడు రోజుల నుంచి ఉప్పూడిలో గ్యాస్‌ లీకవుతుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఉప్పూడిలో భారీగా గ్యాస్‌ లీక్‌ అవుతుండడంతో.. పోలీసులు ముందస్తు రక్షణా చర్యల్లో భాగంగా గ్యాస్‌ లీక్‌ అవుతున్న ప్రదేశం నుంచి కిలోమీటర్ పరిధిలోని ఇళ్లను ఖాళీ చేయించారు. కాట్రేనికోన మండలానికి తాత్కాలికంగా వావానాల రాకపోకలను నిలిపివేశారు.

ఉప్పూడిలో 10 సంవత్సరాల క్రితం ఓఎన్జీసీ సంస్థ గ్యాస్‌ లైన్‌లను ఏర్పాటు చేసింది. గతంలో ఓఎన్జీసీ సిబ్బంది నిర్వహణలో భాగంగా పైప్‌ లైన్‌కు డ్రిల్‌ చేశారు. లో ప్రేజర్‌ గ్యాస్‌ ఉండటంతో డ్రిల్లింగ్‌ పూర్తి చేసి సీల్‌ వేశారు. రిగ్‌ మరమ్మత్తులు నిర్వహించే సమయంలో వాల్‌ వదిలి వేయడంతో గ్యాస్‌ ఉవ్వేత్తున ఏగసిపడింది. భారీ శబ్దాలతో గ్యాస్‌ ఎగిసి పడుతుండటంతో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. రిగ్‌ పరిసరాల పరిధిలోని ఇళ్లను పోలీసులు ఇప్పటికే ఖాళీ చేయించారు. సంఘటనా స్థలాన్ని అమలాపురం ఆర్జీవో భవానీ శంకర్‌, ముమ్మడివరం సీఐ రాజశేఖర్‌లు పరిశీలించారు. ఉప్పూడి గ్రామంలో ఎవరూ కూడా వంట పోయ్యిలు వెలిగించవద్దని.. అగ్రి ప్రమాదం సంభంవించేందుకు దోహదం చేసే ఏ విధమైన వస్తువులను ఉపయోగించవద్దని పోలీసులు హెచ్చరించారు. కాగా నిత్యం గ్యాస్‌ లీకేజీలు తమ గుండెల్లో కుంపటిగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంజి

Next Story