ఏపీ దిశ బిల్లును వ్యతిరేకించిన కేంద్రం

By రాణి  Published on  4 Feb 2020 5:47 AM GMT
ఏపీ దిశ బిల్లును వ్యతిరేకించిన కేంద్రం

ముఖ్యాంశాలు

  • బిల్లులు సాంకేతిక లోపాలున్నాయన్న కేంద్రం
  • లోపాలను సరిదిద్దే పనిలో అధికారులు..

ఆడపిల్లల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందించిన దిశ యాక్ట్ -2019 ను కేంద్రం వెనక్కి పంపించింది. ‘‘బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలున్నాయి..వాటిని సరిదిద్దండి’’ అని కేంద్రం సూచించింది. కేంద్రం వెనక్కి పంపించిన బిల్లు అసెంబ్లీకి వచ్చింది. అక్కడి నుంచి అది ప్రభుత్వానికి చేరింది. దిశ బిల్లులో పేర్కొన్న 7వ షెడ్యూల్ లో ఎంట్రీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని సరిచేసి బిల్లును మళ్లీ కేంద్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్రం ఎత్తి చూపిన సాంకేతిక అంశాలను సరిచేసి మళ్లీ పంపే పనిలో నిమగ్నమయింది.

మరోవైపు ఈ నెల 7వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్, యాప్ ను ప్రారంభించనున్నారు. సోమవారం ఈ విషయంపై ప్రభుత్వ కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 7వ తేదీన దిశ పీఎస్ ప్రారంభం తర్వాత వన్ స్టాప్ సెంటర్ ను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమానికి జగన్ హాజరై దిశ యాప్, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ను ప్రారంభిస్తారన్నారు.

Next Story