సిర్పూర్‌లో పేపర్ మిల్లులో గ్యాస్ లీక్.. పరుగులు తీసిన కార్మికులు
By సుభాష్ Published on 11 May 2020 6:22 PM ISTఏపీలోని విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఉన్న పేపర్ మిల్లులో గ్యాస్ లీకై ఒకరిద్దరు అస్వస్థతకు గురయ్యారు. సీఎల్‌ఓ 2 ప్లాట్ వద్ద సోమవారం ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న 20 మంది కార్మికులు భయంతో పరుగులు తీశారు. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బాయిలర్‌కు అత్యంత సమీపంలో క్లోరీన్ గ్యాస్ లీక్ కావడంతో కార్మికులంతా పరుగులు తీశారు. క్లోరిన్‌గాఢత తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై స్పందించేందుకు జేకే పేపర్ మిల్ యాజమాన్యం నిరాకరించింది. లాక్‌డౌన్ కారణంగా పూర్తిస్థాయిలో వినియోగంలో లేకపోవడంతో క్లోరీన్ లిక్విడ్ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తర్వాత లీకవుతున్న గ్యాస్‌ను యాజమాన్యం అరికట్టింది.