గ్యాస్ సిలిండర్ల ట్రక్కు పేలుడు.. వీడియో చూశారంటే..
By సుభాష్ Published on 30 May 2020 2:40 PM IST
జమ్మూకశ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉదంపూర్ జిల్లాలో టిక్రీ ప్రాంతంలో ఎల్‌పీజీ సిలిండర్ల ట్రక్కు ఒక్కసారిగా పేలిపోయింది. అధికారుల అందించిన వివరాల ప్రకారం.. జమ్మూ నుంచి శ్రీనర్‌కు ఎల్‌పీజీ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్కు జాతీయ రహదారిపై ఆకస్మాత్తుగా పేలింది. దీంతో సిలిండర్లు పెద్ద ఎత్తున శబ్దాలు చేస్తూ పేలాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు పూర్తిగా దగ్ధమైపోయింది. పేలుడు ధాటికి అక్కడి ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దాదాపు అగంట పాటు డజన్ల కొద్ది సిలిండర్లు ఒకటి తర్వాత ఒకటి పేలడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుకి తీసుకువచ్చారు. అయినా త్వరగా మంటలు అదుపులోకి రాకపోవడంతో రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. తర్వాత వాహనాల రాకపోకలు పునరుద్దరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో కొందరు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సిలిండర్ల ట్రక్కు పేలుడు దృశ్యాలు
�