వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్..ఎలా చెయ్యాలో తెలుసుకోండి..
By రాణి
ఇప్పటి వరకూ గ్యాస్ బుక్ చేయాలంటే సంబంధిత ఏజెన్సీ నంబర్ కు కాల్ చేసి, గ్యాస్ నంబర్ ఎంటర్ చేస్తే ఒకట్రెండు రోజులకే గ్యాస్ సిలిండర్ డెలివరీ వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ గా వాట్సాప్ నుంచి ఒక్క మెసేజ్ తో గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. అంతే కాదు గడిచిన ఆరునెలల్లో మీ ఖాతాలో గ్యాస్ సబ్సిడీ డబ్బు ఎంత వరకూ డిపాజిట్ అయింది ? ఎన్ని సిలిండర్లు వాడారు ? ఇంకా ఈ ఏడాదిలో ఎన్ని సిలిండర్లు సబ్సిడిలో వస్తాయన్న విషయాలను కూడా తెలుసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ వాట్సాప్ గ్యాస్ బుకింగ్ సేవలు కేవలం హెచ్ పీ గ్యాస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. గ్యాస్ బుకింగ్ కోసం వాట్సాప్ నుంచి 9222201122 కు వివరాలు మెసేజ్ చేయడం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా ఇలా బుక్ చేసుకోవాలి
9222201122 నంబర్ ను సేవ్ చేసుకుని, వాట్సాప్ లో ఆ నంబర్ కు HELP అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. తర్వాత మీకు Please send any of the below keywords to get help. SUBSUDY/QUOTA/LPGID/BOOK అని రిటర్న్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకునేందుకు BOOK అని టైప్ చేసి సెండ్ చేస్తే కస్టమర్ పేరు, కస్టమర్ నంబర్ వివరాలతో మెసేజ్ వస్తుంది. మీకు వచ్చిన మెసేజ్ లో మీ గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన వివరాలు కరెక్టే అయితే Y అని టైప్ చేసి సెండ్ చేస్తే గ్యాస్ బుక్ అవుతుంది.
Also Read : చంద్రబాబు నాయుడు బర్త్ డే స్పెషల్ సాంగ్
అలాగే సబ్సిడీ వివరాలు తెలుసుకోవాలంటే..SUBSIDY అని టైప్ చేసి సెండ్ చేస్తే వివరాలు కనిపిస్తాయి. కోటా వివరాల కోసం QUOTA అని టైప్ చేసి సెండ్ చేస్తే ఒక మెసేజ్ వస్తుంది. మీరు సంవత్సరంలో 4 సిలిండర్లు వాడితే 4|12 గా చూపిస్తుంది. అంటే ఇంకా 8 సిలిండర్లను సబ్సిడీపై పొందదవచ్చు. LPG వినియోగదారు 17 నంబర్లను తెలుసుకోవడానికి LPGID అని టైప్ చేసి సెండ్ చేస్తే వివరాలు మెసేజ్ లో వస్తాయి.
Also Read : అమ్మాయి ముందు అలా కూర్చోవడం పద్ధతి కాదు : పవన్ కు రేణు స్వీట్ వార్నింగ్