ముంబై: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని గంటూలీ అన్నారు. ఈ రోజు ఉదయం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. భారత క్రికెట్‌కు మేలు చేసేందుకే తాను వచ్చానన్నారు. క్రికెట్ కమిటీలు, సంఘాల్లోకి క్రికెటర్లు రావడం భవిష్యత్తులో మంచి చేస్తుందన్నారు. కోహ్లీకి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఇప్పుడే ..కెప్టెన్, కోచ్ గురించి మాట్లాడితే బాగుండదన్నారు. భారత్ క్రికెట్ చరిత్రలో ధోనిది ప్రత్యేక స్థానమన్నారు గంగూలీ. టీమిండియా అందరీ ఎంపిక బీసీసీఐ చేతుల్లో ఉంటుందన్నారు కొత్త బీసీసీఐ బాస్.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

One comment on "హమ్మయ్యా..కోహ్లీ గాలి పీల్చుకోవచ్చు..!"

Comments are closed.