గంగూలీ బెంగాల్ సీఎం అవుతాడు- సెహ్వాగ్ జోస్యం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 6:23 PM GMT
గంగూలీ బెంగాల్ సీఎం అవుతాడు- సెహ్వాగ్ జోస్యం

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొత్త అవతారం ఎత్తాడు. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత జ్యోతిష్యునిగా మారిపోయాడు. తాజాగా బీసీసీఐ ఛైర్మన్ సౌరభ్ గంగూలీ గురించి సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. గంగూలీ ఏనాటికైనా బెంగాల్‌కు ముఖ్యమంత్రి అవుతాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో గంగూలీ సీఎం కావడం ఖాయమని ఢంకా భజాయించి మరీ చెప్పాడు. గంగూలీ గురించి గతంలో కూడా తాను ఓ మాట చెప్పానని, అది నిజమైందని సెహ్వాగ్ గుర్తు చేశాడు. గంగూలీ బీసీసీఐకి అధ్యక్షుడు అవుతాడని 2007లోనే చెప్పానని సెహ్వాగ్ తెలిపాడు. ఆ మాట నిజమైనందున గంగూలీ సీఎం కావడం కూడా నిజమవుతుందని ధీమాగా చెప్పాడు. 2007లో జరిగిన ఓ ఘటనను వీరేంద్రుడు గుర్తు చేసుకున్నాడు. కేప్‌టౌన్‌ టెస్టులో సెహ్వాగ్, వసీం జాఫర్ త్వరగా అవుటయ్యారు. టెండూల్కర్ బ్యాటింగ్‌కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గంగూలీ బ్యాటింగ్‌కు వెళ్లాడు. ఆ మ్యాచ్‌లో దాదా అద్భుతంగా ఆడాడు. గంగూలీ బ్యాటింగ్ చేస్తుండగా డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్ల మధ్య సంభాషణ జరిగింది. ఆ సందర్భంగా, బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అర్హత గంగూలీకే ఉందని చెప్పాను. అప్పుడు తన మాటను అందరూ అంగీకరించారని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Next Story
Share it