పాతబస్తీలో మరోసారి గ్యాంగ్ వార్!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Sept 2019 4:34 PM IST
- ఓల్డ్ సిటీలో గ్యాంగ్ వార్
- నలుగురికి తీవ్ర గాయాలు
- రంగంలోకి పోలీసులు
హైదరబాద్ : పాతబస్తీలో మరోసారి గ్యాంగ్ వార్ వెలుగులోకి వచ్చింది. రొడ్డు మీద కొట్టుకుంటున్న రెండు గ్యాంగ్‌ల వీడియోలను పబ్లిక్ వీడియో తీశారు. అంతేకాదు..ఆ వీడియోలను పోలీసులకు షేర్ చేశారు. గ్యాంగ్ వార్ లో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. . గాయపడ్డ వారికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఓల్డ్ సిటీలో జరిగాయి. చిన్న వివాదం కాస్తా రెండు గ్రూపులు కొట్టుకునే వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. బహూదుర్ పూర్ పరిధిలోని బెంగుళూర్ హైవె పై రెండు గ్యాంగ్‌లు కర్రలతో దాడి చేసుకున్నారు. కర్రలతో విచక్షణారహితంగా రొడ్డు మీద కొట్టుకున్నారు.
గ్యాంగ్ వార్ పై పోలీసులకు వెంటనే సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి పరిస్దితిని చక్క బెట్టారు. చిన్న వివాదమే ఈ గ్యాంగ్ వార్ కు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. అర్ద రాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనను పోలీసులు సిరియస్ గా తీసుకున్నారు . ఇప్పటికే కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు .