వరంగల్‌ యువతి గ్యాంగ్‌ రేప్‌ కేసులో బయటపడ్డ సంచలన నిజాలు

By Newsmeter.Network  Published on  28 Nov 2019 10:12 AM GMT
వరంగల్‌ యువతి గ్యాంగ్‌ రేప్‌ కేసులో బయటపడ్డ సంచలన నిజాలు

ముఖ్యాంశాలు

  • పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
  • యువతి క్లాస్ మెట్ అత్యాచార యత్నం
  • మరిన్ని కీలక ఆధారాలు రాబడుతున్న పోలీసులు

వరంగల్‌లో సంచలన సృష్టించిన యువతి గ్యాంగ్‌ రేప్‌, హత్య కేసు మిస్టరీ వీడింది. యువతిని తన క్లాస్‌మెట్‌ అత్యాచారయత్నం చేయగా, తర్వాత తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోఉన్న ఆమె మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. యువతి గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయితో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని రహస్యంగా పోలీసులు విచారిస్తున్నారు. మానస పుట్టిన రోజునే దుండగులు ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచి వేస్తోంది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

దీనదయాళ్ నగర్‌కు చెందిన మల్లయ్య, స్వరూప దంపతులు కుమార్తె మానస. బుధవారం ఆమె పుట్టిన రోజు కావడంతో భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకునివస్తానని చెప్ప వెళ్లింది. గుడికి వెళ్లిన యువతి ఎంతకి తిరిగిరాకపోవాడంతో తల్లి దండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

బుధవారం అర్ధరాత్రి సమయంలో హంటర్ రోడ్డులో యువతి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కూతురు పుట్టినరోజే ఇలా హత్యకు గురికావడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్‌ మార్చురీకి తరలించారు.

ఘటన స్థలంలో సీసీ ఫుటేజ్‌ పరిశీలన:

యువతి హత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు... ఘటనా స్థలం సమీపంలో సీసీ ఫుటేజ్ పరిశీలించారు. నిందితుడు మానస క్లాస్‌మెట్ సాయిగా గుర్తించి.. కీలక ఆధారాలను సేకరించారు. అతడ్ని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టినరోజు నాడు మానసను నమ్మించి సాయి బయటికి తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారయత్నం చేయగా.. యువతికి తీవ్ర రక్త స్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఉంటుందని, తర్వాత యువతి చనిపోవడంతో.. రోడ్డు ప్రక్కనే మృతదేహాన్ని పడేసి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన వెనుక సాయి ఒక్కడే ఉన్నాడా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు ద్వారా మరిన్ని నిజాలు బయటపడే అవకాశాలున్నాయి.

Next Story
Share it