రూమ్‌కు పిలిచి.. అస‌భ్యంగా.. పీరియడ్స్ అని చెప్ప‌గానే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Feb 2020 5:22 PM IST
రూమ్‌కు పిలిచి.. అస‌భ్యంగా.. పీరియడ్స్ అని చెప్ప‌గానే..

బాలీవుడ్ డ్యాన్స్ మాస్ట‌ర్ గణేష్‌ ఆచార్యను వివాదాలు వ‌ద‌ల‌డం లేదు. వారం క్రితం ఓ మహిళా కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య లైంగిక న‌న్ను లైంగికంగా వేధిస్తున్నాడ‌ని ఫిర్యాదు చేయ‌గా.. తాజాగా మరో మహిళ కూడా గణేష్‌ ఆచార్య తనను లైంగికంగా వేధించాడని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ)కు ఫిర్యాదు చేశారు.

1990లో ముంబయిలోని అంథేరిలో గ‌ల‌ సహిబా హాల్‌కు తాను వెళుతుండగా.. అక్కడ కొంత‌మంది సీనియ‌ర్ మాస్టర్లు డ్యాన్స్‌ క్లాసులు తీసుకునేవారని.. అక్క‌డే కమల్‌ మాస్టర్‌ వద్ద గ‌ణేష్ ఆచార్య అసిస్టెంట్‌గా పనిచేసేవాడని బాధితురాలు పేర్కొంది. అప్పట్లో తన వ‌య‌స్సు 18 సంవత్సరాల‌ని.. నాన్‌ మెంబర్‌ డ్యాన్సర్‌గా పనిచేసేదాన‌నని ఆమె పేర్కొంది. అయితే.. ఓ రోజు ఆచార్య లైవ్‌ క్లాస్‌ పేరుతో తనను హోటల్ రూమ్‌కు పిలిపించి.. లైంగిక దాడికి ప్ర‌యత్నించాడని.. పెళ్లి చేసుకుంటానంటూ అసభ్యకరంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని.. తాను పీరియడ్స్‌లో ఉన్నాన‌ని చెప్పగానే విడిచిపెట్టి వెళ్లాడ‌ని ఆ మ‌హిళ పేర్కొంది.

అయితే.. తన‌పై లైంగిక ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ ఇద్దరు మహిళల విష‌య‌మై గణేష్‌ ఆచార్య స్పందించారు. నా ప్రతిష్టను దెబ్బతీయ‌డానికే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. నాపై ఎన్ని కుట్రలు పన్నినా భయపడనని ఆచార్య అన్నారు.

Next Story