గౌతమ్ గంభీర్ ఇంట్లో చోరీ
By తోట వంశీ కుమార్ Published on 29 May 2020 11:56 AM IST
బీజేపీ ఎంపీ, టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఆయన తండ్రి కారును దొంగలు ఎత్తుకెళ్లారు. గురువారం తెల్లవారు జామున తన ఇంటి ఆవరణలో ఉంచిన ఎస్‌యూవీ కారు చోరికి గురైనట్లు గంభీర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఎంపీ ఇంట్లో కారు చోరీకి గురికావడంతో ఈ కేసును పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి.. నిందితులను పట్టుకోవడానికి పలు టీమ్స్ ను ఏర్పాటు చేశారు. దొంగల కోసం పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, గంభీర్ తన తండ్రితో కలసి రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే.
Next Story